Ye Maaya Chesave: పదిహేనేళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన ‘ఏ మాయ చేసావె’ చిత్రం, వచ్చే నెల 18న రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సమంత, చైతన్యలు కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తలను సమంత ఖండించారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఆమె, ఈ విషయంలో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రమోషన్స్‌కు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని, ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. చిత్రబృందంతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్దేశం లేదని తెలిపారు. అభిమానులు నటీనటులు కలిసి ప్రమోట్ చేయాలని కోరుకోవచ్చని, కానీ వ్యక్తిగత జీవితం ప్రేక్షకుల అంచనాలపై ఆధారపడదని సమంత స్పష్టం చేశారు. ఈ చిత్రం రీ-రిలీజ్‌తో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

