Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఎక్కడ కనిపించినా అభిమానులు, ఫోటోగ్రాఫర్ల హడావిడి సర్వసాధారణం. ఆన్‌లైన్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ ఆఫ్‌లైన్‌లోనూ అంతే స్థాయిలో కనిపిస్తుంది. అయితే, ఈ హడావిడి కొన్నిసార్లు ఆమెకు ఇబ్బందిగా మారుతోంది. తాజాగా, జిమ్ నుంచి బయటకు వచ్చిన సమంతను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు.
Also Read: Kubera: ‘కుబేర’ గ్రాండ్ ప్రీమియర్స్: యూఎస్‌లో తెలుగు, తమిళ వెర్షన్స్ రెడీ, హిందీ ఆలస్యం!
Samantha: ఆ సమయంలో ఆమె సీరియస్‌గా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పటికీ, ఫోటోగ్రాఫర్లు ఆమెను విడిచిపెట్టలేదు. దీంతో సహనం కోల్పోయిన సమంత, ‘ఆపండి’ అంటూ వారిపై చిరాకు వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్‌ను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. సమంత ఈ సంఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.
View this post on Instagram


