Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. అయితే, తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో సల్మాన్ తన ఆరోగ్య సమస్యల్ని బహిరంగంగా చెప్పుకొచ్చారు. 59 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తన ఆరోగ్యమేనని షాకింగ్ విషయం వెల్లడించారు. రోజూ షూటింగ్‌లతో శరీరం ఒత్తిడికి గురవుతోందని, పక్కటెముకలు విరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిజెమినల్ న్యూరల్జియాతో ముఖంలో తీవ్ర నొప్పిని భరిస్తున్నానని, మెదడులో అనెరిజమ్, ఏవీ మాల్‌ఫార్మేషన్‌తోనూ బాధపడుతున్నానని తెలిపారు. ఈ సమస్యలతో పెళ్లి, కుటుంబ బాధ్యతలు తీసుకోవడం కష్టమని స్పష్టం చేశారు. 2017లో ‘ట్యూబ్‌లైట్’ ప్రమోషన్స్‌లో ట్రిజెమినల్ న్యూరల్జియా గురించి తొలిసారి ప్రస్తావించిన సల్మాన్, ఈ వ్యాధి మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని చెప్పారు. సల్మాన్ ఆరోగ్య పోరాటం, పెళ్లి నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
