Samantha

Samantha: సాయి పల్లవి కోసం రాస్తే.. ఈ సినిమా నన్ను ఎంచుకుంది..!

Samantha: సమంత చాలా రోజుల తర్వాత నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి తాను ఈ సినిమాకి కేవలం నిర్మాతగానే ఉండాలని అనుకున్నట్లు సమంత తెలిపారు. స్క్రిప్ట్ పూర్తవగానే సాయిపల్లవి దగ్గరికి వెళ్లి కథ చెప్పగా, ఆమెకి స్టోరీ బాగా నచ్చింది. తాను ఈ సినిమా చేయాలనుకున్నారు కూడా, కానీ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారు.

దీంతో ఈ సినిమాలో చివరికి నేనే నటించాల్సి వచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్‌ను నేను ఎంచుకోలేదు, ఈ సినిమానే నన్ను ఎంచుకుంది. ఆ తర్వాత నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు ఈ సినిమాకు స్టోరీ ఇవ్వగా, నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ‘ఓ బేబీ’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇక ట్రైలర్ చూసుకుంటే.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఫుల్ యాక్షన్ కూడా సినిమాలో ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఒక మంచి కోడలు అనిపించుకోవడానికి సమంత క్యారెక్టర్ ప్రయత్నాలు చేస్తుంటే.. మధ్యలో గుండాలు వచ్చి తన ఫ్యామిలీని చంపాలని చూడడం, ఇంకోపక్క సమంత ఫ్లాష్‌బ్యాక్ గురించి చిన్న గ్లింప్స్ చూపించడం ఆకట్టుకున్నాయి. ఇదంతా చూస్తుంటే సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌లో ఉండబోతుందని అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *