Sai Pallavi

Sai Pallavi: హిట్ కోసం స్టార్ హీరో కొడుకు స్ట్రగుల్స్.. సాయి పల్లవి పైనే నమ్మకం?

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ హవా సృష్టిస్తోంది! రామాయణ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సీతగా నటిస్తున్న సాయి, ఈ సినిమా విడుదలకు ముందే మరో ప్రాజెక్ట్‌తో అలరించనుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు, కానీ ‘ఏక్ దిన్’గా పిలుస్తున్నారు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.

జునైద్ గతంలో ‘మహారాజ’తో నెట్‌ఫ్లిక్స్‌లో, ‘లవ్‌యాప’తో థియేటర్లలో అడుగుపెట్టాడు. అయితే, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు. జునైద్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘ఏక్ దిన్’ విజయం సాయి పల్లవిపై ఆధారపడింది. బాలీవుడ్‌లో సాయికి ఇది తొలి చిత్రం అయినా, సౌత్ సినిమాల ద్వారా ఆమెకు ఇప్పటికే యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. సాయి ఓ సినిమా ఒప్పుకుంటే అందులో పదునైన కథ, ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

ఈ సినిమాలో జునైద్‌కు మంచి బ్యాకప్ ఉన్నప్పటికీ, సాయి పల్లవి నటన, ఆకర్షణే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించనున్నాయి. ఈ చిత్రం సాయి కెరీర్‌లో మరో మైలురాయి కానుంది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sharwanand: తమిళ క్లాసిక్ దర్శకుడితో శర్వానంద్ కొత్త సినిమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *