Ek Din Teaser: దక్షిణాది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెడుతున్న భారీ చిత్రం ‘ఏక్ దిన్’ టీజర్ విడుదలైంది. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న ఈ రొమాంటిక్ డ్రామాను సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్లో సాయి పల్లవి ‘మీరా’ అనే పాత్రలో ఎంతో సహజంగా కనిపిస్తూ, తన హిందీ డైలాగులతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
“సినిమాల్లో జరిగినట్లు నిజ జీవితంలో ఎందుకు జరగవు?” అనే ఆసక్తికరమైన సంభాషణలతో సాగే ఈ టీజర్, జునైద్ – సాయి పల్లవి మధ్య ఉన్న అందమైన కెమిస్ట్రీని పరిచయం చేసింది. రామ్ సంపత్ అందించిన సంగీతం ఈ ప్రేమకథకు మరింత ఫీల్ గుడ్ వైబ్‌ని జోడించింది. ‘కొన్ని ప్రేమ కథలకు కాలంతో పనిలేదు’ అనే థీమ్‌తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
Also Read: Dhanush-Mrunal: వాలెంటైన్స్ డే నాడు ధనుష్-మృణాల్ పెళ్లి?
ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని మే 1న వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. సాయి పల్లవి నటిస్తున్న తొలి హిందీ సినిమా కావడంతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఘనంగా ఉండబోతుందని అర్థమవుతోంది.
