Sabarimala: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఆదివారం కూడా క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. రోజుకు లక్షకు పైగా భక్తజనం స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. నిన్నటి నుంచి 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అయ్యప్పస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.
Sabarimala: ప్రత్యేక టోకెన్ల ద్వారా అయ్యప్పస్వామిని 20 వేల మందికిపైగా దర్శనం చేసుకున్నారు. పంబ నుంచి సన్నిధానం వరకూ క్యూలైన్లలో అయ్యప్ప మాలధారులు భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. ఆయా భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా కనీస వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మకర జ్యోతి దర్శనానంతరం వరకు అయ్యప్ప భక్తులు ఇదే రీతిలో పెద్ద సంఖ్యలో తరలివస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.