AP News: రిమాండ్‌లో ఉన్న ఓ రౌడీషీటర్‌కు పోలీసులు రాచమర్యాదలు చేశారు.. చివరికి ఉన్నతాధికారుల వేటుకు బలయ్యారు. సామాన్య ప్రజలతో కటువుగా ఉండే పోలీసులు.. ప్రమాదకర స్థాయి నిందితుడికి మాత్రం మర్యాదలతో మమకారాన్ని చాటారు. ఫలితంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. తెలిసి జరిగిందా? తెలియక జరిగిందో! ఏమో కానీ, పోలీసుల తీరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు పెత్త ఎత్తున తప్పుపడుతున్నారు.
AP News: వివిధ కేసుల్లో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను మంగళగిరి కోర్టుకు బుధవారం తరలించారు. విచారణ అనంతరం మళ్లీ రాజమండ్రి జైలుకు తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు పోలీసులు తీసుకెళ్లారు. అతనితో మర్యాదపూర్వకంగా వ్యవహారిస్తూ రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు బిర్యానీ తినిపించారు.
ఖైదీని వాహనంలోనే ఉంచి భోజనం అందించాలి. కానీ, నేరుగా అత్యంత గౌరవంగా హోటల్‌కు తీసుకెళ్లి బిర్యానీలు, చికెన్, మటన్ వంటకాలను పెట్టించారు. అనిల్‌తోనే బిల్లు కట్టించారు.
AP News: ఇదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు సెల్‌ఫోన్‌లో విందు భోజనం తీరును బందిస్తుండగా, వారిని బెదిరించి, సెల్‌ఫోన్లను లాక్కొని వీడియోలను డిలీట్ చేశారు. అయితే రౌడీషీటర్‌కు పోలీసులు వింధుభోజనం చేయిస్తున్న వీడియోలు ఆ హోటల్ సీసీ కెమెరాలో బందీకావడం గమనార్హం. ఈ విషయం ఆలస్యంగా గురువారం వెలుగు చూశాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు. అక్కడ ఉన్న ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.