Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ తన కెరీర్‌లో జరిగిన ఓ సరదా సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. ‘హూ ఈజ్ ది బాస్’ అనే యూట్యూబ్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్, 2013లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్‌టీ20) మ్యాచ్ సందర్భంగా తాను చేసిన ఓ తప్పును గుర్తు చేసుకున్నారు.
ఆ సందర్భాన్ని రోహిత్ ఇలా వివరించాడు:
“ఆ మ్యాచ్‌లో మేము టాస్ గెలిచాం. టాస్‌కు ముందు మా టీం ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ టాస్ గెలిచిన తర్వాత నోటి వెంటనే ‘బ్యాటింగ్’ అన్నాను.
అంతే, మా కోచ్ అనిల్ భాయ్ (అనిల్ కుంబ్లే) నన్ను ఆశ్చర్యంగా చూస్తూ వచ్చి, ‘ఏంటి రోహిత్, ప్లాన్ మారిపోయిందా?’ అని అడిగాడు. అప్పుడు నేను, ‘పిచ్ బాగుందనిపించింది అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నా’ అని చెప్పా. కానీ నిజం ఏంటంటే, టాస్ దగ్గర ఏం చెప్పాలనే విషయం నాకు మర్చిపోయిపోయింది. కాబట్టి పొరపాటుగా బ్యాటింగ్ అన్నాను” అంటూ నవ్వేశాడు.
తన తడబాటు కారణంగా కాస్త కంగారుపడ్డానని చెప్పిన రోహిత్, కానీ చివరకు ఆ మ్యాచ్ గెలవడం సంతృప్తి ఇచ్చిందన్నాడు.