Road Accident: ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మండలం, కిష్టారం సమీపంలో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం ప్రకారం, వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Naga Vamsi: 2026లో ఎవరికీ ఛాన్స్ ఇవ్వను.. ట్రోలర్లకు సమాధానమిస్తా: నాగ వంశీ
ఇద్దరికి గాయాలు:
ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు, పోలీసులు సహాయంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

