Raja Shivaji: బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకుడిగా మారి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ‘రాజా శివాజీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2026 మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. అభిషేక్ బచ్చన్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ, శివాజీ మహారాజ్‌కి నివాళిగా ఈ చిత్రాన్ని అభివర్ణించారు. రితేష్ ఈ చిత్రంలో శివాజీ పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.
మరాఠీ, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం ముంబై, వాయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, మహేష్ మంజ్రేకర్, జెనీలియా దేశ్‌ముఖ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో, జ్యోతి దేశ్‌పాండే, జెనీలియా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంగీతం అజయ్-అతుల్, సినిమాటోగ్రఫీ సంతోష్ శివన్ అందిస్తున్నారు. శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక కథను ప్రపంచానికి చాటేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది.
RITEISH DESHMUKH DIRECTS ‘RAJA SHIVAJI’ – WILL RELEASE IN MULTIPLE LANGUAGES ON 1 MAY 2026… #RajaShivaji – based on #ChhatrapatiShivajiMaharaj – is set to release worldwide on #MaharashtraDay: 1 May 2026.
Directed by #RiteishVilasraoDeshmukh, who also essays the titular role,… pic.twitter.com/HK4txIb54Q
— taran adarsh (@taran_adarsh) May 21, 2025

