Rishabh Pant

Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ధోనీ తర్వాత టెస్టు కెప్టెన్సీ చేపట్టిన రెండో వికెట్ కీపర్!

Rishabh Pant: డాషింగ్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తూ, 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్-బ్యాటర్‌గా నిలిచాడు. 1932లో భారత్ తొలి టెస్ట్ ఆడినప్పటి నుంచి ఇప్పటివరకు 38 మంది ఆటగాళ్లు జట్టుకు కెప్టెన్సీ వహించారు.

అయితే, వికెట్ కీపర్-బ్యాటర్‌గా జట్టు పగ్గాలు చేపట్టిన వారిలో మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత పంత్ మాత్రమే. శుభ్‌మన్ గిల్ మొదటి టెస్ట్‌లో మెడ నొప్పి కారణంగా పూర్తిగా కోలుకోకపోవడంతో, అతని స్థానంలో పంత్‌కు తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు దక్కాయి.148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో, పంత్‌తో కలిపి కేవలం 35 మంది వికెట్ కీపర్-బ్యాటర్లు మాత్రమే తమ జాతీయ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కింది.

ఇది కూడా చదవండి: KTR: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ ఫైనల్‌ రిపోర్ట్‌..

ఎం.ఎస్. ధోనీ వికెట్ కీపర్-కెప్టెన్‌గా అత్యధిక టెస్టులకు (60 టెస్టులు, 27 విజయాలు) నాయకత్వం వహించిన రికార్డును కలిగి ఉన్నారు. పంత్‌కు టెస్ట్ కెప్టెన్సీ ఇదే తొలిసారి అయినా, గతంలో 2022 జూన్ 9న దక్షిణాఫ్రికాపై ఢిల్లీలో తన తొలి టీ20 కెప్టెన్సీని ప్రారంభించాడు. టీ20ల్లో ఐదు మ్యాచ్‌లకు నాయకత్వం వహించి, రెండు విజయాలు, రెండు పరాజయాలను చవిచూశాడు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *