Rishab Shetty: ‘కాంతర’ సినిమాతో జాతీయ స్థాయిలో నటుడిగా, దర్శకుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న రిషభ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతార చాప్టర్ 1’ మూవీ చేస్తున్నారు. ఇది వచ్చే యేడాది అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మూవీలో రిషభ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ రెండూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాగా తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన మరో సినిమా ప్రకటన వెలువడింది. హిందూ పద్ పాద్ షాహి శివాజీగా రిషబ్ శెట్టి నటించబోతున్నాడు. సందీప్ సింగ్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు. మొత్తానికీ ఇటు హనుమంతుడిగా, అటు ఛత్రపతి శివాజీగా నటిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న హిందువుల హృదయాలలో శాశ్వత స్థానాన్ని పొందబోతున్నాడు రిషభ్.
