Revanth vs Messi: ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రా.7.30 గంటలకు జరిగే రేవంత్vsమెస్సీ ఫుట్‌బాల్ మ్యాచుకు టికెట్ ఉన్న వారినే అనుమతించనున్నారు. ఈ మ్యాచుకు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 450 సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 20నిమిషాల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచులో సీఎం రేవంత్ ‘సింగరేణి RR9’ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. మ్యాచ్ తర్వాత మెస్సీతో పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.
Also Read: WTC 2025-27: WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు షాక్: ఏడో స్థానానికి పతనం!
ఈ తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్న మెస్సీ సాయంత్రానికి హైదరాబాద్ కు రానున్నారు. ఇక్కడ మ్యాచ్ అనంతరం ఫొటో సెషన్ ఉండనుంది. ఆయనతో ఫొటో దిగేందుకు రూ.10లక్షల ఫీజు నిర్ణయించగా 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు హైదరాబాద్ గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. అటు ఇవాళ సాయంత్రం ఉప్పల్‌లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 27 వేల టికెట్లు బుక్ అయ్యాయి. గత ఏడాది సెసెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఫుట్‌బాల్‌ను ప్రోత్సహిస్తామంటూ ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను నిర్వహించింది. భారత్‌తో పాటు సిరియా, మారిషస్ జట్లు ఇందులో పాల్గొన్నాయి.
