Rc16 Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16 వ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో చేస్తున్నాడు. ఇటీవల నైట్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసింది చిత్ర యూనిట్.ఎక్కువ బ్రేకులు,గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. VFX వర్క్స్ ఏమిలేకపోవడంతో షూటింగ్ ను స్పీడ్ గా కానిచ్చేస్తున్నాడు బుచ్చిబాబు. వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారట. బుచ్చి బాబు కి ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది. దీంతో మేకింగ్ త్వరగా అయిపోతుంది. ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బిగ్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట రామ్ చరణ్. కాగా ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్ అనుకోలేదట. త్వరలో చిన్న షెడ్యూల్ కోసం యూనిట్ ఢిల్లి వెళ్లనుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
