RC16: గ్లోబల్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని మేకర్స్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ ఏంటి అనేది ఎప్పుటి నుంచో పెద్ద సస్పెన్స్ గానే మిగిలి ఉంది. ఈ సినిమాని అనుకుంటున్న సమయం నుంచే పెద్ది అనే టైటిల్ వినిపిస్తూ వచ్చింది.
Also Read: Women’s Commission: ‘అదిదా సర్‌ప్రైజు’ స్టెప్పులపై మహిళా కమిషన్ సీరియస్!
RC16: అయితే ఈ టైటిల్ పట్ల ఫ్యాన్స్ లో అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కానీ ఫైనల్ గా మేకర్స్ అదే టైటిల్ ని లాక్ చేసేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇక ఈ టైటిల్ టీజర్ ని ఈ మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలీదు కానీ.. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

