టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో జడేజా 86 పరుగులు చేయడమే కాకుండా 5 వికెట్లు కూడా తీశాడు. జడేజా ఒక టెస్టు మ్యాచ్‌లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసి ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇది 12వ సారి కావడం విశేషం. ఈ క్రమంలో భారత క్రికెటర్ లలో జడేజానే టాప్ లో ఉన్నాడు. ఆ తరువాత అశ్విన్ ఉన్నాడు. ఇప్పటివరకు 11 సార్లు చేసిన అశ్విన్, షకీబ్ అల్ హసన్‌లు ఈ ఫిట్ ను అందుకున్నారు. జడేజా కంటే ఇయాన్ బోథమ్ మాత్రమే ఈ అద్భుతమైన ఫిట్ ను నమోదు చేయగలిగాడు. దిగ్గజ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బోథమ్ 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు… ఒక టెస్ట్‌లో 16 సార్లు అద్భుతంగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. అటు తొలి టెస్టు మ్యాచులో 280 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత స్క్వాడ్‌లో మార్పులు లేవని బీసీసీఐ పేర్కొంది. ఈ నెల 27నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు జరగనుంది.
స్క్వాడ్: రోహిత్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్

