Ravi Teja

Ravi Teja: రవితేజ ఊహించని నిర్ణయం.. రెమ్యునరేషన్ లేకుండా నటన!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాప్‌ల నేపథ్యంలో కొత్త సినిమాకు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఆయన మాస్ ఇమేజ్‌పై ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై ఆస్తి కబ్జా కేసు!

ధమాకా హిట్ తర్వాత రవితేజ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. మాస్ జాతర కూడా నిరాశ పరిచింది. ఫ్యాన్స్ ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే కొత్త చిత్రాన్ని సడన్‌గా ప్రకటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. గ్లింప్స్ చూస్తే మాస్ రాజా ట్రాక్ మార్చినట్లు స్పష్టమవుతోంది. వరుస ఫ్లాప్‌ల మధ్య ఈ సినిమాకు రవితేజ రెమ్యునరేషన్ లేకుండా నటిస్తున్నట్లు టాక్. నిర్మాతలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. సక్సెస్ అయితే పర్సంటేజ్ రూపంలో తీసుకుంటారని మరో వార్త వినిపిస్తుంది. నిర్మాతలు నష్టపోకూడదన్న రవితేజ ఆలోచనకు నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాలి. ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో కీలకమవుతుందని అంచనా.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *