Spirit: ప్రభాస్–సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’ సినిమా లాంచింగ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ తృప్తి దిమ్రి, చిత్ర బృందంతో పాటు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, స్క్రిప్ట్‌ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు అందజేసి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, ఈ గ్రాండ్ లాంచ్ కంటే కూడా, మెగాస్టార్ చిరంజీవి డైరెక్షన్ టీమ్‌తో కలిసి దిగిన ఒక ఫోటో ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఆ ఫోటోలో సందీప్ వంగా పక్కన, స్టార్ హీరోల ఇద్దరు కుమారులు కనిపించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
వారసులు కెమెరా వెనుక: రవితేజ, త్రివిక్రమ్ కుమారులు
ఆ ఇద్దరు యువకులు మరెవరో కాదు… ఒకరు మాస్ మహారాజా రవితేజ కుమారుడు మహాధన్, మరొకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి. వీరిద్దరూ స్పిరిట్ సినిమాకు సంబంధించిన డైరెక్షన్ టీమ్‌లో పనిచేస్తున్నారని గత కొంతకాలంగా రూమర్లు వినిపించాయి. తాజాగా చిరుతో దిగిన ఈ అధికారిక ఫోటోతో ఆ వార్త నిజమైంది.
తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, రిషి కూడా దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన డైరెక్షన్‌లో మెళకువలు నేర్చుకోవడం మొదలుపెట్టినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: iBomma Ravi: ఐ బొమ్మ రవి(iBomma Ravi)కి క్రేజీ చూస్తే.. మైండ్ బ్లోయింగ్ బ్రో!
అందరూ ఊహించినట్టుగా హీరోగా కాకుండా, మహాధన్ దర్శకత్వం వైపు మొగ్గు చూపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రి రవితేజ మాదిరిగానే, సినిమా ఫండమెంటల్స్‌ను పూర్తిగా నేర్చుకున్నాకే ముందుకు వెళ్లాలనే ఆలోచనతో మహాధన్ కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమయ్యాడని తెలుస్తోంది.
స్టార్ హీరోలు, డైరెక్టర్ల కుమారులు కెమెరా ముందు హీరోలుగా కాకుండా, కెమెరా వెనుక దర్శకత్వ విభాగంలో పనిచేయడం టాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. తెలుగు సినిమా భవిష్యత్తుకు ఈ యువ వారసులు బలమైన పునాది వేస్తారని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
