Ravi Teja

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో సినిమా: సంక్రాంతికి విడుదల

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ మరోసారి సంక్రాంతి పండగను సినిమా సందడితో నింపేందుకు సిద్ధమవుతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ త్వరలో పూర్తవనుంది. పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Navya Nair: మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. ప్రముఖ నటి నవ్యా నాయర్‌కు భారీ జరిమానా!

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం #RT76 సంక్రాంతి 2026కి సిద్ధమవుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. యంగ్ బ్యూటీస్ కాయదు లోహర్, మమితా బైజు రవి తేజ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 16న ప్రారంభమైంది. వచ్చే నవంబర్ చివరిలోపు పూర్తవనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రవితేజ సిగ్నేచర్ శైలితో సంక్రాంతి బరిలో హోరెత్తించనుంది. గతంలో కిషోర్ తిరుమల ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి హిట్‌లతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం రవితేజ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Registration: జనన మరణాల డేటాను సకాలంలో నమోదు చేయడం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *