Nee Kosam: హీరో రవితేజ, దర్శకుడు శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ – ఈ ముగ్గురికీ విజయం రుచి చూపిన తొలి చిత్రం ‘నీ కోసం’… దర్శక, సంగీతదర్శకులకు ఇదే మొదటి సినిమా! హీరోగా రవితేజకు కూడా ఇదే ప్రథమం… 1999 డిసెంబర్ 3న విడుదలైన ‘నీ కోసం’ సినిమా మంచి విజయం సాధించింది… మహేశ్వరి నాయికగా నటించిన ఈ లవ్ స్టోరీలో ఫ్యాక్షనిజమ్ బ్యాక్ డ్రాప్ చోటు చేసుకుంది… ఈ చిత్రాన్ని ఘంటా శ్రీనివాస్ నిర్మించారు… పలు బాలారిష్టాలు దాటుకొని చివరకు రామోజీరావు పుణ్యమా అని ‘నీ కోసం’ జనం ముందు నిలచింది… అనూహ్యంగా ‘నీ కోసం’ చిత్రం విజయం సాధించడంతో అందరికీ మంచి గుర్తింపు లభించింది… అందువల్ల రవితేజ, శ్రీను వైట్ల, ఆర్పీ కి ‘నీ కోసం’ ఓ స్సెషల్! పాతికేళ్ళ క్రితం ‘నీ కోసం’ సినిమా ప్రేక్షకులను మెప్పించింది… డిసెంబర్ 3న ఈ ముగ్గురి అభిమానులు తప్పకుండా ‘నీ కోసం’ను గుర్తు చేసుకోక మానరు.
ఇది కూడా చదవండి: RGV: మహాన్యూస్ క్వశ్చన్.. ఆర్జీవీ ఇరిటేషన్.. నేను చెప్పను.. ఫో..!