The Girlfriend: రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ థియేటర్లలో హిట్ అయింది. టాక్సిక్ రిలేషన్ షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Nagabandham: 20 కోట్లతో రామానాయుడు స్టూడియోస్‌లో ‘నాగబంధం’ హై-వోల్టేజ్ క్లైమాక్స్!
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మంచి బజ్‌తో థియేటర్లలో విడుదలై హిట్ టాక్ సాధించింది. రష్మిక మందన్నా మెయిన్ లీడ్‌గా, దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం టాక్సిక్ రిలేషన్‌షిప్‌ల పట్ల యువతలో అవగాహన కల్పించింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించారు. థియేటర్లలో చూడలేని వారు ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఎమోషనల్ థ్రిల్లర్‌ను ఆస్వాదించవచ్చు.

