Rarest of Rare Case: సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాలు మనసును ద్రవింప చేస్తున్నాయి. కన్న కూతురినే మరో వ్యక్తితో కలిసి హత్యాచారం చేసిన తండ్రి పాపం పండింది. మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపేసిన నేరం కన్న తండ్రే చేశాడని కోర్టు నిర్ధారించింది. అతనే దోషి అని తేల్చింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ దగ్గరలోని మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 9, 2019న, మైనర్ బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులను కూడా దర్యాప్తు చేశారు. ఆ తరువాత రెండు రోజులకు ఆ బాలిక మృత దేశం DTA పార్కులో చేతులు, కాళ్ళు కట్టివేసిన స్థితిలో కనిపించింది. పోస్ట్ మార్టంలో ఆ బాలికపై అత్యాచారం జరిగినట్టు తేలింది. ఎంత దారుణానికి దుండగులు ఒడిగట్టారంటే.. అత్యాచారం చేసిన తరువాత ఆ బాలిక ప్రయివేట్ పార్టులపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశారు. హత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి అరెస్ట్
Rarest of Rare Case: ఈ క్రమంలో పార్క్ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు పోలీసులు. బాలిక మృత దేహాన్ని సూట్ కేస్ లో పెట్టి తీసుకు వచ్చి అక్కడ పాడేసినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించిన పోలీసులు బాలిక తండ్రి రామ్ చరణ్ (57), ఇంకొక వ్యక్తి రాజేందర్(27) ఈ దారుణానికి ఒడికట్టినట్టు నిర్ధారించుకున్నారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
ఈ కేసులో పోలీసులు వారిద్దరిపై ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అదనపు సెషన్స్ జడ్జి బబితా పునియా ఈ కేసును విచారించి, 24వ తేదీన నిందితులిద్దరినీ దోషులుగా ప్రకటించారు. మొత్తం 168 పేజీల తీర్పులో, న్యాయమూర్తి ఈ కేసును అత్యంత అరుదైన నేరంగా ప్రకటించారు.

