Ram Gopal Varma: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఏపీలోని ఒంగోలు ఇతర ప్రాంతాల్లో వర్మపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, వారి కుటుంబంపై వర్మ అనుచిత పోస్టులు పెట్టి మనోభావాలను దెబ్బతీశారని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఆయనపై వివిధ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఏకంగా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
Ram Gopal Varma: ఈ దశలో ఆయన పరారీలో ఉన్నారని, ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాలరని, షాద్‌నగర్ సమీపంలోని ఓ ఫాంహౌజ్‌లో తలదాచుకున్నారని ప్రచారం జరిగింది. ఆయన ఇంటికి పోలీసులు వస్తే ఆయన పారిపోయారని తెలిసింది. దీంతో గురువారం ఆయన ఏకంగా హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారని, తనపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకుండా పోలీసులను ఆదేశించాలని వర్మ ఈ మేరకు హైకోర్టును కోరారు.
అయితే ఈకేసును సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు .