Ram Charan: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’గా సంక్రాంతికి రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తదుపరి బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నాడు. మల్లయుద్ధ యోధుడు కోడి రామ్మూర్తి స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. దీని కోసం రామ్ చరణ్ పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యాడు. నవంబరు ద్వితీయార్థంలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఆరంభం కానుంది. 15 రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్ ను మైసూర్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో ప్లాన్ చేశారట. ఆ తర్వాత హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ జరపనున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో జాన్వీకపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక ఈ మూవీకి ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు. మైత్రీమూవీస్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలసి వృధ్దిమాన్ సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.
