Peddi: ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న దర్శకుడు బుచ్చిబాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. ‘ఆరెంజ్’ సినిమాలోని రొమాంటిక్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా జోడించి, చరణ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మెగా ఫ్యాన్స్ ఈ జోడీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని ఉత్సాహంగా అంటున్నారు.
Also Read: Atlee: కాపీ ఆరోపణలపై అట్లీ సమాధానం ఇదే!
Peddi: ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటన, రెహమాన్ మ్యూజిక్ కలిస్తే ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram