Rakul: బాలీవుడ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో హైదరాబాద్‌లో తనకు ఇల్లు గిఫ్ట్‌గా వచ్చిందన్న గాసిప్‌లపై తొలిసారి నోరు విప్పింది. “ఆ ఇల్లు నేనే సొంతంగా కొన్నాను. మా నాన్న పత్రాలన్నీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ రూమర్ విని ఆయన తీవ్రంగా కోప్పడ్డారు.
‘నువ్వు ఈ విషయంలో గట్టిగా స్పందించు’ అని సీరియస్ అయ్యారు” అని రకుల్ వెల్లడించింది. అయితే, ఇలాంటి నీచమైన వార్తలకు సమాధానం ఇవ్వడం వ్యర్థమని, అలాంటి పోర్టల్స్ ని పట్టించుకోనని స్పష్టం చేసింది.
Also Read: NTR-Prashanth Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ డ్రామా.. భారీ సెట్స్‌పై రచ్చ!
Rakul: తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా మెరిసిన రకుల్, ఇప్పుడు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఆమె, హిందీ చిత్రాలతో బిజీగా మునిగిపోయింది. తాజా ప్రాజెక్ట్‌లతో రకుల్ మరింత గ్లామర్‌గా, ట్రెండీగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది.