Raksha Bandhan 2025: రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల ప్రేమకు, పరస్పర నమ్మకానికి, బంధానికి చిహ్నం. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ను హిందూ సాంప్రదాయంలో ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి రాఖీ పండుగ ఆగస్టు 9, శనివారం న జరుగుతోంది. ఈ సందర్భంగా రాఖీ కట్టే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే మీ బంధం ఇంకా బలపడుతుంది.
శుభ సమయాన కట్టండి
రాఖీ కట్టడానికి సరైన సమయం చాలా ముఖ్యం. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఉదయం 5:57 గంటల నుంచి మధ్యాహ్నం 1:24 వరకు రాఖీ కట్టేందుకు శుభ సమయం. అయితే రాహుకాలం లోపు రాఖీ కట్టడం మంచిది. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకండి.
ట్రేలో ఏమేమి ఉంచాలి?
రాఖీ కట్టే ముందు, ఒక పూజా తాలి (ట్రే) సిద్ధం చేయాలి. అందులో ఈ వస్తువులు ఉండాలి:
-
రాఖీ
-
అక్షత (కలిపిన బియ్యం)
-
తమలపాకు
-
ఉంగరం లేదా చిన్న కానుక
-
నాణెం
-
స్వీట్లు
ఈ వస్తువులు లేకుండా రాఖీ వేడుక అసంపూర్తిగా భావిస్తారు.
ఇది కూడా చదవండి: Amaravati: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: ఉచిత బస్సు పథకానికి శంకుస్థాపన తేదీ ఖరారు
ఎటు ముఖంగా కట్టాలి?
రాఖీ కట్టేటప్పుడు దక్షిణ దిశకి ముక్కుపెట్టకుండా చూడాలి. తూర్పు లేదా ఉత్తర దిశకి ముఖం పెట్టి రాఖీ కట్టడం శుభమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది సోదరుడికి సంతోషం, ఆరోగ్యం, విజయాన్ని తీసుకువస్తుందన్న నమ్మకం ఉంది.
నల్ల దుస్తులకు గుడ్‌బై చెప్పండి
రాఖీ రోజు నల్ల దుస్తులు ధరించకండి. హిందూ సాంప్రదాయంలో నలుపు రంగును అశుభంగా పరిగణిస్తారు. అలాగే నల్ల రాఖీలు కూడా వేయకూడదు. బదులుగా పచ్చ, ఎరుపు, పసుపు వంటి శుభరంగులను ఎంచుకోవాలి.
రాఖీ కేవలం తంతు కాదు… బంధం
రాఖీ పండుగ అంటే కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదు. ఇది ఒక అమ్మాయి తన అన్నయ్యపై, తమ్ముడిపై ఉన్న ప్రేమను, శ్రద్ధను, నమ్మకాన్ని తెలియజేసే పవిత్రమైన రోజు. అందుకే ఈ పండుగను మన మనస్ఫూర్తిగా జరుపుకోవాలి. అన్ని జాగ్రత్తలతో, మంచి సమయాన, మంచి ఆలోచనలతో జరుపుకుంటే మీ బంధం జీవితాంతం మరిచిపోలేనిదిగా మిగిలిపోతుంది.
రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🎉