Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ సినిమా కూలీ టికెట్ సేల్స్‌లో సునామీ సృష్టిస్తోంది. బుక్‌మైషోలో ఒక్క రోజులోనే లక్షలాది టికెట్లు బుక్ అవుతూ రికార్డులు బద్దలవుతున్నాయి. రజనీ ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు హైప్ మామూలుగా లేదు. మరి, ఈ కూలీ జోరు ఎంతవరకు వెళ్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Mahavatar Narasimha: మహావతార్ నరసింహ బాక్సాఫీస్ రణరంగం!
రజనీకాంత్ నటించిన కూలీ సినిమా బుక్‌మైషోలో ఒక్క రోజులో 5.72 లక్షల టికెట్లను అమ్మేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుకింగ్స్ పెరగడం విశేషం. రజనీ నటన, లోకేష్ యాక్షన్ సీక్వెన్సెస్, అనిరుధ్ సంగీతంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుంది. టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది.