Rajinikanth 173

Rajinikanth 173: ఒక్క సినిమా డైరెక్టర్ కి కమల్, రజనీ సినిమా

Rajinikanth 173: చేతులు మారుతూ వచ్చిన రజినీకాంత్ సినిమా చివరికి ఓ యంగ్ డైరెక్టర్ చేతికి చిక్కింది. కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై రజినీకాంత్ 173వ సినిమాను నిర్మిస్తున్నారు. శిబి చక్రవర్తిని దర్శకుడిగా ఖరారు చేస్తూ ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది.

ఆ పోస్టర్ కింద “ప్రతి ఫ్యామిలీకి ఒక హీరో ఉంటాడు” అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు శిబి చక్రవర్తి 2022లో శివకార్తికేయన్‌తో ‘డాన్’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఇది కూడా చదవండి: Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే.. లేదంటే పార్టీ కష్టమే

రజినీకాంత్ సినిమా పక్కా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. దీనిని 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయాల్సి ఉండగా.. ‘కూలీ’ సినిమా ఫలితం, మరోవైపు ఆయన హీరోగా నటిస్తుండటంతో ఈ అవకాశం చేజారింది. ఆ తర్వాత సుందర్ సి, ప్రదీప్ రంగనాథన్ పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరికి శిబి చక్రవర్తికి ఈ అవకాశం దక్కింది. ఈ సినిమా పోస్టర్‌ను గమనిస్తే, 2022లో హాలీవుడ్ లో విడుదలైన ‘ది అవుట్‌ఫిట్’ (The Outfit) సినిమా గుర్తుకు వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *