Telangana: జన్వాడలోని తన ఇంటిలో జరిగిన ఫంక్షన్ కేసులో రాజ్ పాకాల బుధవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాల ఇంటిలో అనుమతి లేకుండా ఫంక్షన్ జరిగిందని కేసు నమోదైంది. ఈ కేసులో తగిన సాక్షాలతో రెండు రోజుల్లో కోర్టుకు హాజరు కావాలని రాజ్‌పాకాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయన మోకిలా స్టేషన్‌లో విచారణకు హాజరవ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నది.