Samantha

Samantha: సమంత కొత్త జీవితం: అత్తవారింట్లో గ్రాండ్‌ వెల్‌కమ్‌

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ప్రముఖ దర్శకుడు రాజ్‌ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగభైరవి దేవాలయంలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. వివాహం జరిగిన మరుసటి రోజు (డిసెంబర్ 2న) సమంతకు అత్తవారింట్లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్‌ సోదరి శీతల్‌, నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్‌ నోట్‌ను పంచుకున్నారు. తమ కుటుంబంలోకి సమంతను ఆహ్వానించారు. రాజ్‌ నిడిమోరు సోదరి శీతల్, నూతన వధూవరుల ఫోటోను షేర్ చేస్తూ రాసిన నోట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: Imran Khan: పుకార్లకు చెక్.. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు కానీ..

ఆనందంతో మాటలు రావడం లేదు. గొప్ప భక్తుడు ఆర్తితో నిండిన హృదయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటాడో ఈరోజు నేను అలా ఉన్నాను. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత- రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకుసాగుతుండడం చూసి మాకెంతో గర్వంగా ఉంది. ఒకరిపై ఒకరికి గౌరవం, నిజాయతీతో రెండు హృదయాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతో నిండిపోతుంది. మేము వీరికి ఎప్పుడూ అండగా ఉంటాము” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈషా ఫౌండేషన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ భావోద్వేగ పోస్ట్‌కు సమంత స్పందిస్తూ.. ‘లవ్‌ యూ’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 1న జరిగిన వివాహ వేడుకలో సమంత ఎర్రచీరలో, రాజ్ నిడిమోరు క్రీమ్-గోల్డ్ కలర్ కుర్తాలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ నూతన జంట పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *