Railway: ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడింది. జగదల్పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ నీటమునిగిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా విశాఖపట్నం-కిరండోల్, కిరండోల్-విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
రైల్వే అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ, ట్రాక్ సురక్షితమని నిర్ధారించిన తర్వాతే రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రయాణికులు ప్రయాణానికి ముందు అధికారిక సమాచారం తెలుసుకోవాలని సూచించారు.