Kissik Song: ‘పుష్ప2’ సినిమా రిలీజై అన్ని చోట్లా దుమ్మ దులుపుతోంది. ప్రత్యేకించి నార్త్ లో సంచలన రికార్డ్స్ ను నమోదు చేస్తోంది. ఈ సినిమాలో పాటలు వైరల్ అవటంతో పాటు రీల్స్ లోనూ సందడి చేస్తున్నాయి. ఇక ఐటమ్ సాంగ్ ‘కిస్సిక్..’ అయితే చెప్పే పని లేదు. దేవిశ్రీ సంగీతం అందిచిన ఈ పాటలో అల్లుఅర్జున్, శ్రీలీల మాస్ స్టెప్స్ రిలీజ్ ముందే వైరల్ అయి లక్షలాది ఔత్సాహికుల రీల్స్ కి కంటెంట్ గా మారిపోయాయి. ‘పుష్ప’ లో సమంత యాక్ట్ చేసిన ‘ఊ అంటావా మామ’ ఎలా కోట్లాది రీల్స్ కి ముడిసరుకు అయిందో ఇప్పుడు ‘కిస్సిక్..’ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా పలువురు ‘కిస్సిక్…’ పాటకు రీల్స్ కడుతున్నారు. ఇక ఈ పాటకు కర్ణాటక లోని ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ లో బామ్మలు చేసిన డాన్స్ రీల్ గా మారి నెట్ వరల్డ్ లో తెగ వైరల్ అవుతోంది. 17 సెకండ్స్ మాత్రమే ఉన్ ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వ్యూయర్స్ చూసేశారు. బామ్మలు అందరూ సింక్ తో ఈ పాటకు డాన్స్ చేయటం అందరినీ ఆకట్టుకుంటోంది. యూనిట్ సభ్యులు కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ‘బామ్మలా… మజాకా’ అనేస్తున్నారు. మరి మీరూ చూసేయండి.
View this post on Instagram