Pushpa 2: భారీ అంచనాల నడుమ డిసెంబర్ 4న బెనిఫిట్ షోలతో, 5న థియేటర్లలో విడుదలైన పుష్ప-2 సినిమాకు కర్ణాటక రాష్ట్రంలో బిగ్ ఎఫెక్ట్ పడింది. ఆ రాష్ట్ర రాజధాని నగమరైన బెంగళూరులో పుష్ప-2 సినిమాను మిడ్‌నైట్, ఎర్లీ మార్నింగ్ షోలను ప్రదర్శించరాదని ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. ఉదయం ఆరు గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్ట విరుద్ధమని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Pushpa 2: హైదరాబాద్ నగరంలో పుష్ప-2 సినిమా యూనిట్‌కు విషాదాన్ని నింపింది. బెనిఫిట్ షో సమయంలో ఓ థియేటర్‌లో జరిగిన తోపులాట సందర్భంగా ఓ మహిళ చనిపోవడం విషాదకరం. ఆమె తనయుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరాగా, ఈ సినిమా హీరో అల్లు అర్జున్ అభిమానుల మధ్య సినిమా చూసేందుకు వచ్చారు. ఈ దశలో ఆయనను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు తోసుకొని వచ్చారు.
Pushpa 2: ఇదే సమయంలో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం ఏకంగా అల్లు అర్జున్‌ను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నది. మహిళ చావుకు ఆయనే కారణమంటూ ఆరోపించింది. సినిమా ఎలా ఉన్నది అన్న విషయాన్ని పక్కనబెడితే ఈ విషాద ఘటన ప్రేక్షక లోకాన్ని కలచివేస్తున్నది.