Priyanka Gandhi: దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. 3 లక్షల మెజారిటీ

Priyanka Gandhi: తొలిసారి ఎన్నికల బరిలో నిలచిన ప్రియాంక గాంధీకి చక్కటి రెస్పాన్స్ వచ్చింది. వాయనాడు ప్రజలు ప్రియాంక గాంధీకి భారీ స్థాయిలో మద్దతు పలికారు.ప్రియాంక గాంధీ వాద్రా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఈ వార్త రాస్తున్న సమయానికి కేరళలోని వయనాడ్‌ పార్లమెంట్ స్థానంలో ఆమె మెజార్టీ ప్రస్తుతం 3 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ 3.19 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె తర్వాతి స్థానాల్లో సీపీఐ అభ్యర్థి సత్యన్‌ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఉన్నారు.

సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదటి ట్రెండ్‌లో మా నాయకురాలు ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతోందని చెప్పారు. అలాగే వయనాడ్ ప్రజలు ఈ రోజు భారీ మెజారిటీ ఇచ్చి కొత్త రికార్డ్ నమోదు చేయబోతున్నారని, ప్రియాంక గాంధీ భారీ విజయంతో పార్లమెంట్ లో అరంగేట్రం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  botsa satyanarayana: వైసీపీ ఓటమి – వంద కారణాలు.. బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *