Padma Awards 2025

Padma Awards 2025: రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం..

Padma Awards 2025: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటిని ప్రదానం చేశారు. ఈ ఘన వేడుకకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రముఖులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మొత్తం 139 మంది ప్రముఖులను పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో 7 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించాయి. రెండు విడతలుగా అవార్డుల ప్రదానం జరిగింది. మొదటి విడతలో 71 మందికి, రెండవ విడతలో 68 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

తెలుగు రాష్ట్రాల ప్రతిభకు ప్రాధాన్యత

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈసారి పద్మ పురస్కారాలను అందుకున్నారు. సామాజిక సేవ, కళ, వైద్యం, సాహిత్యం వంటి విభాగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ గౌరవం లభించింది.

  • మంద కృష్ణ మాదిగ – సామాజిక సేవలో విశేష కృషికి పద్మశ్రీ

  • కెఎల్ కృష్ణ – ప్రజా వ్య‌వ‌హారాల్లో సేవలందించినందుకు పద్మశ్రీ

  • వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి – భక్తి, సాహిత్య రంగాల్లో సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ

  • డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి – వైద్యరంగ సేవలకు పద్మ విభూషణ్

  • సినీ నటుడు బాలకృష్ణ – కళారంగంలో విశిష్ట సేవలకుగాను పద్మ భూషణ్

  • మాడుగుల నాగఫణిశర్మ – సాహిత్యంలో సేవలకు పద్మశ్రీ

ఇతర ప్రముఖులు కూడా గౌరవితులు

ఈ ఏడాది ఇతర రంగాల నుంచి కూడా పలువురు విశేష ప్రతిభావంతులు పద్మ పురస్కారాలను అందుకున్నారు:

  • రిటైర్డ్ జడ్జి జస్టిస్ జగదీశ్ సింగ్ కేహార్

  • ఫోక్ సింగర్ శారద సిన్హా – పద్మ విభూషణ్

  • సినీ నటుడు అజిత్ కుమార్

  • భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ – పద్మ శ్రీ

ఈ పురస్కారాల ద్వారా దేశానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గౌరవించడం జరుగుతుంది. ఇది యువతకు స్ఫూర్తిగా నిలిచే ప్రయత్నం కూడా.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *