Prabhas

Prabhas: పండక్కి అభిమానులకు స్పెషల్ ట్రీట్.. రాజా సాబ్ కొత్త పోస్టర్ రిలీజ్.. డార్లింగ్ లుక్ అదిరింది.

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఎలాంటి అప్డేట్స్ లేకుండా ఈ మూవీ నుంచి డార్లింగ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం.. పోస్టర్ చుసిన ప్రభాస్ ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. రిలీజ్ అయిన పోస్టర్ లో ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస విజయాలతో దూసుకొని పోతున్నారు.. అలాగే చేతినిండా సినిమాలతో బిజీ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. తను నటిస్తున్న సినిమాలో ఒక్కటే  ‘ది రాజా సాబ్’ సినిమా దీనికి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముందుగా ఫాన్స్ కి ఈ సినిమాపైన అనుమానాలే ఉన్నాయి అని చెప్పుకోవొచ్చు.. దానికి కారణం డైరెక్టర్ ఇంతకు ముందు తీసిన సినిమాలే అని చెప్పుకోవొచ్చు. కానీ ఎప్పుడైతే సినిమా నుండి ఫస్ట్ పోస్టర్, టీజర్, మూవీ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన అప్డేట్స్  తో ఫాన్స్ కి నమ్మకం వచ్చింది. రిలీజ్ అయినా వాటిని చుస్తే వింటేజ్ ప్రభాస్ ని చుస్తునాటే ఉంది.బాహుబలి తర్వాత వరుస ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగమే ‘ది రాజా సాబ్’ ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ చిత్రం.

కొత్తగా రిలీజ్ ఐన పోస్టర్ ని చుస్తే ప్రభాస్ కళ్లద్దాలు పెట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *