Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడి సినిమాలతో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విధంగా బ్యాక్ టు బ్యాక్ కంబ్యాక్ హిట్స్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నెక్స్ట్ మూవీస్ పై ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజిలో ఉన్నాయి. రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ హనురాఘపూడితో చేయబోయే సినిమాని కూడా స్టార్ట్ చేశాడు. ఇక పోతే ప్రభాస్ చేయబోయే సినిమాలలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేయబోయే స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా స్పిరిట్ నుంచి సాలిడ్ అప్డేట్ రానే వచ్చేసింది. ఈ సినిమాని ఈ ఏడాది ఉగాది కానుకగా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
