Prabhas

Prabhas: ‘కల్కి 2898 ఏడీ’సీక్వెల్‌ కి డేట్స్ ఇచ్చిన ప్రభాస్..

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉండగా, వాటన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజి’ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ షూటింగ్ కూడా మొదలైపోయింది.

సాధారణంగా ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాల మీద దృష్టి పెడతారని అందరూ భావించారు. కానీ, తన స్పీడును మరింత పెంచిన ప్రభాస్, ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్-2 కోసం కూడా డేట్స్ కేటాయించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Medaram Maha Jatara: మేడారం జాతరకు సెలవులు ఇవ్వాలి: VHP

నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ కోసం ఫిబ్రవరిలో పది రోజుల పాటు ప్రభాస్ అందుబాటులో ఉండనున్నారు. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే ‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు, ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆ పని పూర్తి కాగానే ‘సాలార్-2’ షూటింగ్‌ను పట్టాలెక్కించనున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ‘ఫౌజి’ సినిమా ‘స్పిరిట్’ కంటే ముందే వస్తుందా లేదా ఆ తర్వాత విడుదలవుతుందా అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ మారింది. మొత్తం మీద ప్రభాస్ తన సినిమాల స్పీడుతో అభిమానులను ఖుషీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *