Kannappa: పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం హీరోగా మాత్రమే కాకుండా గెస్ట్ పాత్రలో కూడా చేస్తున్న ఓ సినిమా ఉంది. ఆ చిత్రమే “కన్నప్ప”. మంచు హీరో మంచు విష్ణు కెరీర్లో భారీ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా తన డ్రీం ప్రాజెక్ట్ కూడా ఇదే కావడం ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ గా అనేకమంది స్టార్స్ కూడా రంగంలో దిగడం హాట్ టాపిక్ గా మారింది.ఇలా మంచి హైప్ ని అందుకున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ రుద్రా అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ పై కొంచెం భిన్నమైన స్పందన వచ్చింది. కానీ తాజాగా మరో పోస్టర్ రిలీజ్ అవగా అది ఫ్యాన్స్ ని ఖుషి చేసిందని చెప్పాలి. ఇందులో డార్లింగ్ హ్యాండ్సమ్ గా మాత్రమే కాకుండా మాస్ గా కూడా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
