Prabhas: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. మంచు విష్ణు, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ పాత్రల పోస్టర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించనున్నట్లు ప్రకటించగా, ఇటీవల విడుదలైన ఆయన లుక్‌కి అదిరిపోయే స్పందన వచ్చింది.
ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించనున్నారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. మొదట ఆయన శివుడి పాత్రలో నటిస్తారని వార్తలు వచ్చినా, ఆ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తారని తేలింది. చిత్రంపై మరింత ఆసక్తి పెరిగేలా చేస్తున్న కన్నప్ప సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.