Prabhas

Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌లో ప్రమాదం.. రెబల్ స్టార్‌కు గాయం? ఫ్యాన్స్‌లో ఆందోళన!

Prabhas: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల కోసం రెస్ట్  లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన “ఫౌజీ” సినిమాలోని ఒక ముఖ్యమైన షెడ్యూల్ షూటింగ్ తీస్తున్నారు. ఈ షూటింగ్‌లో భాగంగా ప్రభాస్ గుర్రపు స్వారీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో, ఆయన చేతికి గాయం అయినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై మూవీ టీమ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన (Official Note) విడుదల చేయలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ, హను రాఘవపూడి, నాగ అశ్విన్ వంటి దర్శకులతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఎలాగైనా ‘ఫౌజీ’ సినిమాను త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రభాస్‌కు ఈ గాయం కావడంతో, ఆయన కొంతసేపు రెస్ట్  తీసుకున్నారని సమాచారం. ఆ తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యంగానే ఉన్నారని సమాచారం అందుతోంది. ఒకటి లేదా రెండు రోజులు రెస్ట్  తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అయినప్పటికీ, ఈ ఘటనపై చిత్ర యూనిట్ మౌనంగా ఉండటంతో అభిమానుల్లో ఇంకా భయం నెలకొంది. ప్రభాస్ త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు.

మరోవైపు, ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాను కూడా క్వాలిటీ తగ్గకుండా త్వరగా పూర్తి చేయాలని వంగ చూస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది.  ఎలాగైనా ఆ డేట్ ని మిస్ చేయకుండా రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉంది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్, వాయిస్ ఓవర్ గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *