Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అవమానిస్తూ పోస్టులు పెట్టిన ఘటనపై ముగ్గురు వ్యక్తులను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పిఠాపురం సీఐ జి. శ్రీనివాస్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మార్ఫింగ్ చేసిన ఫోటోతో అసభ్య ప్రచారం
విశాఖపట్నంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న అసలైన ఫోటోను మార్ఫ్ చేసి, పవన్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫేక్ ఫోటోను వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫార్ముల్లో విస్తృతంగా షేర్ చేశారు. దీనిపై జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందించాయి.
మూడు ప్రాంతాల నుంచి నిందితుల అరెస్ట్
పోలీసుల విచారణలో ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి:
-
కర్రి వెంకట సాయి వర్మ – కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం యస్ యానా గ్రామం
-
పాముల రామాంజనేయులు – మచిలీపట్నం వలందపాలెం ప్రాంతం
-
షేక్ మహబూబ్ – హైదరాబాద్ సరూర్‌నగర్ సింగరేణి కాలనీకి చెందినవాడు
ఈ ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని మరింత విచారణ చేపట్టారు. ఇంకా ఈ కేసులో ఇతరులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Vande Bharat Train: వందే భారత్’ ఏసీ కోచ్ లో వాటర్ లీక్.. 8 గంటలు నరకం చూసిన ప్రయాణికులు
పోలీసుల హెచ్చరిక
సోషల్ మీడియాలో ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు స్పష్టం చేశారు. మార్ఫింగ్ ఫోటోలు, అవమానకర పోస్టులు, పబ్లిక్ ఫిగర్స్‌పై తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.