గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు ఈ 10 నెలల్లో పెట్టినవి కాదని, గత ప్రభుత్వ హయాంలో పెట్టిన బకాయిలే ఎక్కువగా ఉన్నాయని, ఈ విషయాన్ని యజమానులు గమనించాలన్నారు.బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
గురుకుల మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నాను.. గురుకులాల వద్ద పెట్టిన బ్యానర్లు వెంటనే తొలగించి.. సక్రమంగా తరగతులు కొనసాగనివ్వండని కోరారు.విద్యాబోధనకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని బకాయిని చెల్లించే బాధ్యత మాది లేదంటే నన్ను గాని, ముఖ్యమంత్రిని కానీ, అదీ కుదరకపోతే అధికారులను కలవండని సూచించారు.
పాత బకాయిలతో సహా మెస్ చార్జీలు కూడా 3 రోజుల క్రితమే చెల్లించాం. ఇకపై ఎవరైనా గురుకుల భవనాలకు తాళాలు వేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.ఎక్కడైనా యజమానులు ఇబ్బందులు పెడితే గురుకుల ప్రిన్సిపల్ అర్సీవోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయండి. సదరు యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మంత్రి.