Ponnam Prabhakar: తెలంగాణలో ప్రతిస్ఠాత్మకంగా కుల గణన 

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల సర్వే జరిపింది. ఇందుకోసం సబ్ కమిటీ ,డెడికేటెడ్ కమిటీ వేసుకొని కాబినెట్ తీర్మానం చేసుకొని స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు వేరు వేరు బిల్లులు చట్టం చేయడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ బీసీ ల పక్షాన ధన్యవాదాలు. వారం రోజుల్లో బీసీ మేధావులు ,కుల సంఘాలతో సమావేశం ఏర్పాటీ చేసుకొని భవిషత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. శాసన సభలో బీజేపీ ,బీఆర్ఎస్ ఏకగ్రీవం బీసీ రిజర్వేషన్లు పెంచే తీర్మానానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా కుల సర్వే రోల్ మోడల్. ఇది అమలు చేయడానికి ప్రక్రియ వేగవంతం చేస్తామని అన్నారు.

శాసన సభలో మద్దతు ఇచ్చినట్టు ఇప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ లు మద్దతు ఇవ్వాలి. సుప్రీం కోర్టు తీర్పు మాకు సానుకూలంగా ఉంది.. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది. పారదర్శకంగా చేసిన సర్వే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు. ఎస్సీ వర్గీకరణ దేశంలోనే చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఇది విప్లవాత్మక నిర్ణయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఈ సమయాన్ని క్షేత్ర స్థాయిలో ముందుకు తీసుకుపోతాం. సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న వడ్లు కి బోనస్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు.

చరిత్రలో ఇన్ని కార్యక్రమాలు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు.. కొత్త ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ బిజినెస్ మెన్ అనుకున్న. ప్రభాకర్ రెడ్డి జ్యోతిష్యం చదివినట్టు తెలియదు బిజినెస్ మెన్ అనుకున్న మాకు ప్రజల విశ్వాసం ఇచ్చారు. మా ప్రభుత్వం కూలిపోవాలని మీరు..మీ నాయకుడు కోరుకుంటున్నారో చెప్పండి. 16 నెలలుగా ప్రభుత్వం నడుస్తుంటే కాళ్లల కట్టెల అడ్డుపడుతున్నారు. మీరు పారిశ్రామిక వేత్తల దగ్గర పైసలు తెచ్చుకోవడం కొత్త కాదని అన్నారు. అక్కడ పైసలు తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరని అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *