Ponguleti Srinivas Reddy: జూన్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవలే సీతక్క వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ అంటూ ప్రకటించిన మూడు రోజుల్లోనే మరో మంత్రి ఎన్నికల అంశంపై ప్రకటించడం.. ఎన్నికల నిర్వహణను రూఢీ చేస్తున్నది.
Ponguleti Srinivas Reddy: తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం (జూన్ 16) జరిగే క్యాబినెట్‌లో చర్చించి ఎన్నికల తేదీలపై స్పష్టతను ఇస్తామని మంత్రి తెలిపారు.
Ponguleti Srinivas Reddy: మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఊహాగానాలు ఊపందుకున్నాయి. వారు చెప్పిన ప్రకారం జూలై నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, మరో 10 రోజుల గడువుతో అంటే ఆ నెలాఖరులోనైనా, లేదా ఆగస్టులోనైనా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

