Ponguleti srinivas: గత ప్రభుత్వ పాలనపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టి, మాయమాటలతో అధికారాన్ని భరించిన విధానం వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆరోపించారు.
పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్న ప్రభుత్వం
“గత ప్రభుత్వ హయాంలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. అయినా వాటిని అభివృద్ధికి ఉపయోగించకుండా, రాజకీయం కోసం ఖర్చు పెట్టారు. రూ. 2 వేల కోట్లతో ప్రగతిభవన్‌ను నిర్మించారు. కానీ పేదల కోసం ఇళ్లు మాత్రం నిర్మించలేకపోయారు,” అని మంత్రి విమర్శించారు.
కాళేశ్వరం – కమీషన్ల కోసం ప్రాజెక్టు?
కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, “అది నిజంగా ప్రజల నీటి అవసరాల కోసం కాదే, కమీషన్ల కోసమే కట్టారు,” అని మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును హైదరాబాద్ వరకే పరిమితం చేసి, రైతులకు ప్రయోజనం కలిగే విధంగా అమలు చేయలేదని చెప్పారు.
రైతుల హక్కులు తాకట్టుపెట్టారు
“రైతుల హక్కులను గత ప్రభుత్వం తాకట్టుపెట్టింది. కేవలం హామీలతో రాజీ పడలేం. ప్రస్తుతం ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుంది. రాష్ట్రానికి రావాల్సిన చుక్క నీటిని కూడా వదలమం,” అని ఆయన హామీ ఇచ్చారు.
పక్క రాష్ట్రాలతో లాలూచీ
పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ, గత ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో లాలూచీ పడ్డదని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయంలో, అవినీతిపరుల చేతుల్లో లాలూచీకి లోనయ్యారన్నారు.
కేసీఆర్ మాయమాటలతో సీఎం అయ్యారు
“KCR మాయమాటలతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు,” అంటూ మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.


