Polimera 3

Polimera 3: సంక్రాంతి రేసులో ‘పొలిమేర 3’!

Polimera 3: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ థ్రిల్లర్‌గా వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం “మా ఊరి పొలిమేర”. కొన్నేళ్ల క్రితం డైరెక్ట్‌గా OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజైన ఈ చిన్న బడ్జెట్ మూవీ.. ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సక్సెస్‌తో సీక్వెల్‌కు భారీ హైప్ క్రియేట్ కాగా.. “మా ఊరి పొలిమేర 2″ని మేకర్స్ థియేటర్లలో రిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టారు. ఈ సినిమాతో నటుడు సత్యం రాజేష్ సోలో హీరోగా తన సత్తా చాటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. డైరెక్టర్ అనీల్ విశ్వనాధ్ రూపొందిస్తున్న “మా ఊరి పొలిమేర 3″పై లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2026 సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శకుడు స్వయంగా కన్ఫర్మ్ చేశారు. కానీ ఇక్కడే ట్విస్ట్! సంక్రాంతి రేస్‌లో మెగాస్టార్ చిరంజీవి, దళపతి విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి బడా స్టార్స్ సినిమాలు ఇప్పటికే లైన్‌లో ఉన్నాయి. ఇలాంటి భారీ కాంపిటీషన్ మధ్య “మా ఊరి పొలిమేర 3” ఎలా ఆడుతుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలు కూడా సంక్రాంతి బరిలో విజేతగా నిలిచిన సందర్భాలు గతంలో ఉన్నాయి. మరి ఈ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  BalaKrishna: బాలకృష్ణతో హరీష్ శంకర్ సినిమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *