Vizag: విశాఖ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు రిమాండ్

Vizag: విశాఖ గ్యాంగ్ రేప్ లో నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు టూటౌన్‌ సీఐ బి.తిరుమలరావు తెలిపారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు చెప్పారు. గాజువాక ప్రాంతానికి చెందిన బాధిత యువతితోపాటు వన్‌టౌన్‌ రంగిరీజు వీధికి చెందిన బాత వంశీ, జాలారిపేటకు చెందిన బొడ్డు జగదీశ్‌, కృష్ణాగార్డెన్స్‌కు చెందిన పోలిపల్లి ఆనంద్‌, చేపలుప్పాడకు చెందిన దవులపల్లి రాజేష్‌ నగర శివారులోని ఒక కళాశాలలో ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరం చదువుతున్నారు. బాధిత యువతికి వంశీ ప్రేమ పేరుతో చేరువై పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు.

పెళ్లికి ఆమె ఒప్పుకోవడంతో ఆగస్టు 13న యువతికి ఫోన్‌ చేసి డాబాగార్డెన్స్‌కు రావాలని కోరాడు. ఆమె వచ్చాక, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఉన్న పోలిపల్లి ఆనంద్‌ రూమ్‌కు తీసుకువెళ్లాడు. వంశీ ఇచ్చిన సమాచారం మేరకు బొడ్డు జగదీశ్‌ వారిద్దరూ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియోలో చిత్రీకరించాడు. జగదీశ్‌ ఆ వీడియోను వంశీకి షేర్‌ చేయగా, వంశీ ఆ వీడియోను ఆనంద్‌, రాజే్‌షకు షేర్‌ చేశాడు. వారంతా ఆ వీడియోలను యువతికి చూపించి బెదిరించి పలుమార్లు సామూహికంగా అత్యాచారం చేశారు. ఇంకా తమతో గడపాలంటూ వేధిస్తుండడంతో బాధితురాలు 18న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

యువతి ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదుచేసి నిందితులను అరెస్టు చేశారు. పార్ట్‌ టైమ్‌గా వంశీ, జగదీశ్‌లు స్విగ్గీ డెలివరీ బాయ్స్‌గాను, ఆనంద్‌ ఒక కంపెనీలో క్యాషియర్‌గా, రాజేష్‌ రాడ్‌ బెండింగ్‌ పనులు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు

.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *